![]() |
![]() |

ప్రతీ ఒక్కరి లైఫ్ లో కొత్త బంధాలు, కొత్త ప్రదేశాలు, కొత్త వ్యక్తులు కామన్.. అయితే రెగ్యులర్ గా చేసే పనులని కాకుండా కొత్తగా ఏదైనా చేస్తున్నప్పుడు ఆ అనుభవం అనేది మాటల్లో చెప్పలేం. అలాంటి వాటిని లాంగ్ డిస్టేన్స్ ట్రావెలింగ్, అడ్వెంచర్స్ అని అంటాం. అయితే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ ఆట సందీప్ లైఫ్ లో కొత్త అడ్వెంచర్ చేశాడు.
రాజస్థాన్ లోని జోధ్ పూర్ కి రీసెంటగ్ గా ఆట సందీప్ వెళ్ళాడు. అక్కడ ఎత్తైన కొండల మధ్య రోప్ మీద నుండి ట్రెక్కింగ్ చేశాడు. అది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియోని ఆట సందీప్ తన ఇన్ స్ట్రాగ్రామ్ లో ఓ వీడియో రూపంలో పోస్ట్ చేశాడు. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో వరుసగా ఆరువారాలు నామినేషన్ లో లేకుండా ఉన్న ఏకైక కంటెస్టెంట్ గా ఆట సందీప్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఒకేఒకసారి నామినేషన్ లోకి వచ్చాడు. అప్పుడే ఎలిమినేషన్ అయ్యాడు. ఇది కూడా బిగ్ బాస్ చరిత్రలో రికార్డే. ఇక హౌస్ లో ఎక్కువగా అమర్ దీప్, శోభాశెట్టి, ప్రియాంక జైన్, టేస్టీ తేజలతో కలిసి ఉన్న ఆట సందీప్.. బయటకొచ్చాక ఎవరేంటో తెలుసుకొని రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేశాడు. ఇలా ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాడు ఆట సందీప్.
ఆట సందీప్ అంటే ఒకప్పుడు మంచి క్రేజ్ ఉన్న డాన్సర్. పది పదిహేనేళ్ల క్రితం ఆట, ఛాలెంజ్ లాంటి షోలు ప్రతి వీకెండ్ లోనూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేవి. ఆ టైంలో ‘ఆట’ ఫస్ట్ సీజన్ విన్నర్ గా నిలిచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్..తర్వాతి కాలంలో ఆట సందీప్ గా ఫేమ్ తెచ్చుకున్నాడు. తన తోటి డాన్సర్ ఐన జ్యోతిని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం చిన్న సినిమాలు, ఈవెంట్స్ కి కొరియోగ్రఫీ చేస్తూ కాస్త బిజీగానే ఉన్న సందీప్ జోడి.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇన్ స్టాలో షార్ట్ వీడియోస్ తో డాన్సులు చేయడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లకు స్టెప్స్ నేర్పించడం వంటివి చేస్తుంటారు.
![]() |
![]() |